Navratri Day 2 : విజయవాడ : నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు అమ్మ వారి (Kanaka Durga) దర్శనం కోసం. భవానీలు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా కన్నుల పండువగా మారింది. మొత్తం 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీ బ్రమరాంబికా దేవి రూపంలో దర్శనం ఇవ్వగా మంగళవారం చదువుల తల్లి రూపంలో గాయాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు మజ్జిగ, నీళ్లు ఇస్తున్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
Navratri Day 2 Updates
ఇదిలా ఉండగా ఇవాళ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితతో పాటు ఎమ్మెల్యేలు అమ్మ వారిని దర్శించుకున్నారు. పూజలు చేసిన వారిలో జి. సంధ్యారాణి, పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గల్లా మాధవి, శిరీషా దేవి, బండారు శ్రావణి, కావలి గ్రీష్మలు ఉన్నారు. వీరికి ఆలయ కమిటీ తరపున సాదర స్వాగతం పలికారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వీరందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని కరుణించాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మ వారిని కోరుకున్నామన్నారు.
Also Read : Yuvraj Singh – ED Shocking : ఈడీ ముందు విచారణకు హాజరైన యువరాజ్ సింగ్
















