Lakshma Reddy : హైదరాబాద్ : ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ కుటుంబానికి అక్రమంగా ప్రభుత్వ భూమిని బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేత లక్ష్మారెడ్డి (Lakshma Reddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది. మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదిలీ చేశారని దావాలో పేర్కొన్నారు. సర్వే నంబర్ 307లోని 441 ఎకరాల్లో సీలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని, మిగిలిన ప్రైవేట్ భూమిలో ఇప్పటికే పూర్తిగా ఇండ్లు వెలిశాయని వివరించారు. ప్రస్తుతం అక్కడ ప్రైవేట్ భూమి లేదని, తమ పేరిట ఉన్న 11 ఎకరాలు ఎప్పుడో విక్రయించి వెళ్లిన జా హెద్ బేగం, షేక్ ఇమామ్, ఇశాన్ అమీన్‌ను తీసుకొచ్చి వారి భూమిని కొన్నట్టు చూపుతూ మోసానికి తెర తీశారని ఆరోపించారు.
BRS Leader Lakshma Reddy Challenge
వాస్తవంగా ఆ ముగ్గురి పేరిట ఎలాంటి భూమి లేకపోయినా అక్రమ రిజిస్ట్రేషన్లతో 11 ఎకరాలను స్వాహా చేసేందుకు పథకం రచించారని తెలిపారు పిటిషన్ లో. ఆ 11 ఎకరాలు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. అక్రమంగా చేర్చిన పేర్లను తొలగించాలని, ఇటీవల ఆర్డీవో జారీ చేసిన నాలా ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని, ఆ 11 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని కోరారు. పిటిషన్‌లో ఎమ్మెల్యే గాంధీ భార్య శ్యామల దేవి, కుమార్తె నందిత, మరో ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులతోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌ను ప్రతివాదులుగా పేరొన్నారు.
Also Read : Lakshma Reddy Saved Huge Land : రూ. 15 వేల కోట్ల భూములు కాపాడిన లక్ష్మారెడ్డి
ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు అక్రమ భూబదిలీపై కుత్బుల్లాపూర్ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయాలని, ఒకవేళ ఆయన చర్యలు చేపట్టకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు జస్టిస్ లక్ష్మణ్. అనంతరం ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసే నిమిత్తం తమ పిటిషన్‌ను ఉపసంహరించు కుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపడంతో అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : CM Revanth Reddy Huge Relief : ఓటుకు నోటు కేసులో తీర్పు రిజర్వ్

















