Rajnath Singh : మొరాకో : దాయాది పాకిస్తాన్ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh). ఆయన మొరాకోలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని తీరుతామని ప్రకటించారు. ఉగ్రవాదం రూపంలో భారత దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేస్తే తోక కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో ఆ దేశానికి చుక్కలు చూపించామని చెప్పారు. కాళ్ల బేరానికి రావడం వల్లనే తాము విరమించాల్సి వచ్చిందన్నారు. ఉగ్రవాదుల స్థావరాలను గురి చూసి కొట్టామని, పెద్ద ఎత్తున టెర్రరిస్టులు ఖతం అయ్యారని, దీంతో పాకిస్తాన్ అమెరికా కాళ్ల మీద పడిందని కానీ తాము కనికరించ లేదన్నారు. చివరకు భారత దేశంతో సయోధ్యకు రెడీ అని చెప్పిన తర్వాతనే తాము ఆపరేషన్ సిందూర్ ను నిలిపి వేయాల్సి వచ్చిందన్నారు.
Union Defence Minister Rajnath Singh Warning to Terrorists
ఇదే సమయంలో అమెరికా చీఫ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఒకరు జోక్యం చేసుకుంటే భారత్ విరమిస్తుందని మీరు ఎలా అనుకుంటారంటూ ఎదురు ప్రశ్న వేశారు. భారతదేశం మతం ద్వారా కాకుండా చర్యల ద్వారా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటుందని ప్రకటించారు రాజ్ నాథ్ సింగ్. పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు దానికి భారతదేశం ప్రతిస్పందనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రక్షణ మంత్రి హైలైట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులను వారి మతం కంటే వారి చర్యల కోసం లక్ష్యంగా చేసుకున్నారని, ఏ పౌరుడిని లేదా సైనిక సంస్థను తాకకుండా వదిలేశారని అన్నారు. తాము ఏ దేశంతో కయ్యానికి కాలు దువ్వమని కానీ తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
Also Read : PM Modi Important Update on GST : జీఎస్టీ రాయితీలతో దేశానికి నూతన ఆరంభం: ప్రధాని మోదీ















