Mallikarjun Kharge : ఢిల్లీ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో దీనిపై ఆరా తీశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge). ఇందుకు సంబంధించి సీరియస్ అయ్యినట్లు సమాచారం. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉంటూ ఇలా నోటికి వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఆయన తీరు పట్ల కొందరు మంత్రులు కూడా వాపోయినట్లు తెలిసింది.
Mallikarjun Kharge Slams Minister Ponguleti
ఇదిలా ఉండగా మల్లికార్జున్ ఖర్గేతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తన తీరు పట్ల పలు ఫిర్యాదులు వస్తున్నాయని దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా కోరినట్లు టాక్. తను గంటకు పైగా ఏఐసీసీ చీఫ్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో తను సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాంబులు పేలుతాయని, స్థానిక సంస్థలు త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఎలాంటి కేబినెట్ ఆమోదం లేకుండా ఎలా బహిరంగంగా ప్రకటన చేస్తారంటూ ప్రశ్నించారు ఖర్గే.
ఇక నుంచి సర్కార్ కు ఇబ్బంది కలిగించే ఎలాంటి కామెంట్స్ చేసినా సహించేది లేదని వార్నింగ్ కూడా ఖర్గే పొంగులేటికి ఇచ్చినట్లు సమాచారం.
Also Read : CM Chandrababu Shocking Decision :మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తులు జప్తు
















