Minister Narayana : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 82 లక్షల టన్నుల చెత్త చెదారాన్ని తొలగించడం జరిగిందని చెప్పారు మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana). శుక్రవారం శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసినా 85 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలేసిందని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక చెత్త తొలగింపును యుద్ద ప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తొలగించిన చెత్తతోపాటు వచ్చే అక్టోబర్ 2వ తేదీ లోపు మరో లక్ష టన్నుల చెత్తను తొలగిస్తామని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ.
Minister Narayana Comments
2019-24 మధ్య కాలంలో పారిశుద్య నిర్వహణలో నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్లతో 21 వేల కిమీ డ్రెయిన్ల పూడిక తీశామన్నారు. రాష్ట్రంలోని 6249 బ్లాక్ స్పాట్ లను గుర్తించి ఇప్పటి వరకూ 2000 గ్రీన్ స్పాట్ లుగా మార్చడం జరిగిందని చెప్పారు. ఘన వ్యర్ధాల నిర్వహణ కోసం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. ద్రవ వ్యర్ధాల నిర్వహణకు 1957 ఎంఎల్ డీ కెపాసిటీతో ఎస్టీపీల అవసరం ఉందన్నారు నారాయణ. ప్రస్తుతం 533 ఎంఎల్డీ కెపాసిటీ ఎస్టీపీలు ఉన్నాయని, మరో 1200 ఎంఎల్డీ ఎస్టీపీ లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గత సర్కార్ నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు పొంగూరు నారాయణ.
Also Read : MP Kesineni Sivanath Important Update : నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో
















