EPFO : పీఎఫ్ ఖాతాదారులకు మరింత సౌకర్యం కలిగించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ నిధులను వేగంగా పొందేందుకు ఉపయోగపడే ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు పెంచింది.
EPFO Sensational Update
ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా అధికారికంగా ప్రకటించారు. గతంలో ఈ సౌకర్యాన్ని ప్రధానంగా అనారోగ్యంతో సంబంధం ఉన్న క్లెయిమ్‌లకే పరిమితం చేయగా, ఇప్పుడు విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరాలకు కూడా వర్తింపజేసారు.
ఇంకా వేగంగా – ఇప్పుడు 3 రోజుల్లో క్లెయిమ్ నెరవేరు!
EPFO ప్రకారం, ప్రస్తుతం 95 శాతం క్లెయిమ్‌లను కేవలం మూడు రోజుల్లో పరిష్కరిస్తున్నారు. ఇదివరకు 10 రోజులు పట్టే పరిస్థితితో పోల్చితే ఇది విశేషమైన అభివృద్ధి.
యూపీఐ – ఏటీఎం ద్వారా నేరుగా ఉపసంహరణ
ఈపీఎఫ్ఓ సభ్యులు త్వరలోనే యూపీఐ, ఏటీఎం మార్గం ద్వారా నేరుగా నిధులు ఉపసంహరించుకునే అవకాశాన్ని పొందనున్నారు. 2025 మే–జూన్ మధ్య ఈ సౌకర్యం అమల్లోకి రానుంది.
క్లెయిమ్ తిరస్కరణ రేటు తగ్గింపు
క్లెయిమ్ తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా మరింత మంది సభ్యులకు క్లెయిమ్ మంజూరు అయ్యే అవకాశం పెరిగింది.
డాక్యుమెంటేషన్ అవసరం తగ్గింపు
సభ్యులు KYC పూర్తిచేసి, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా లింక్ చేస్తే, ప్రత్యేకమైన పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ఆటో క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది.
ఏఐ తో మరింత వేగం – 72 గంటల్లో క్లెయిమ్ పరిష్కారం లక్ష్యం
ఈపీఎఫ్ఓ త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచనుంది.
- సభ్యులు UAN పోర్టల్ ద్వారా తాము ఆన్‌లైన్‌లో క్లెయిమ్ దాఖలు చేయగలుగుతారు.
- ఆధార్‌తో UAN లింక్ చేసిన తర్వాత, బ్యాంక్ వివరాలు అప్‌డేట్ చేసేందుకు ఏమీ యజమాని అనుమతి అవసరం లేదు.
- పీఎఫ్, పెన్షన్, బీమా సంబంధిత క్లెయిమ్‌లను 72 గంటల లోపు పరిష్కరించేందుకు EPFO కృషి చేస్తోంది.
Also Read : Manju Pathrose Shocking Decision : చావు అంచుల నుంచి తిరిగొచ్చిన నటి – మంజు పాథ్రోస్ జీవిత సందేశం



















