TTD : అమరావతి : ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టిటిడి (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యురాలు జానకి దేవి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. బుధవారం వెలగపూడిలోని క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
TTD Invites CM Chandrababu
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు. తరువాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్, ఈవో ముఖ్యమంత్రికి వివరించారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు రానున్నారని అంచనా వేస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా ఏ ఒక్క భక్తుడికీ ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు ఈవో. ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
ఇదిలా ఉండగా ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సీఎం తన కుటుంబంతో కలిసి హాజరవుతున్నారు.
Also Read : TTD Interesting Update : ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు
















