Pawan Kalyan : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొలువు తీరిన తీరిన డబుల్ ఇంజన్ సర్కార్ అద్భుతంగా పని చేస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). శక్తివంతమైన నాయకత్వానికి నమూనాగా రాష్ట్రం కేరాఫ్ గా మారి పోయిందని చెప్పారు. రాజమండ్రి ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి తీరం అని స్పష్టం చేశారు. ఎంతో కాలంగా ఉన్న కలను కూటమి హయాంలో కేంద్ర సహకారంతో సాకారం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
Deputy CM Pawan Kalyan Key Comments
గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు పవన్ కళ్యాణ్ కొణిదల, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. ఇదిలా ఉండగా రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద రూ. 94.44 కోట్ల ఖర్చుతో ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టనుంది.
ఈ సందర్బంగా షెకావత్ ప్రసంగించారు. కేంద్రం అన్ని విధాలుగా ఏపీ కూటమి సర్కార్ కు తోడ్పాటు అందజేస్తుందని చెప్పారు. డీపీఆర్ ఇచ్చిన వెంటనే నిధులు మంజూరు చేశామన్నారు. భారీ ఎత్తున నిర్మించే ఈ ప్రాజెక్టు రాబోయే రోజుల్లో పర్యాటక ప్రాంతంగా మారబోతోందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి పెద్దపీట వేశామన్నారు. ఏపీని పర్యాటక హబ్ గా మారుస్తామని ప్రకటించారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కంటే స్పీడ్ గా ముందుకు వెళుతోందని చెప్పారు.
Also Read : Hero Naveen Chandra – Show Time : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో షో టైం
















