Minister Anam : నెల్లూరు జిల్లా : ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల కలకలంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam) తక్షణమే స్పందించారు. విష జ్వరాల సమాచారం తెలియగానే మంత్రి అధికారులను అప్రమత్తం చేసి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆదేశించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల ఘటనపై నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అన్నిస్థాయిల అధికారులతో మంత్రి అత్యవసరంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు.
Minister Anam Ramanarayana Reddy Respond
మంత్రి ఆనం ఆదేశాలతో సమాయత్తమైన వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆత్మకూరు గురుకుల పాఠశాలకు తరలివెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ఆనం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వైద్యులు జ్వరాల బారిన పడిన విద్యార్థినులకు సమీపంలో ఉండే జిల్లా వైద్యశాలకు తరలించి తక్షణ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జ్వరాల బారినపడిన విద్యార్థునుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, స్వచ్ఛమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం హెచ్చరించారు.
Also Read : YSRCP Fired on AP Govt : కనీస మద్దతు ధర రాక రైతన్నల గోస


















