BC Janardhan Reddy : అమరావతి : రాజకీయ పార్టీలకు స్థిరమైన, నిర్దిష్టమైన ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ఏపీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy). శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఎండకా గొడుగు కాసే రాజకీయ పార్టీలను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయని అన్నారు. అలా అనుకుంటే పొరపాటు పడినట్టేనని పేర్కొన్నారు. యూటర్న్ తీసుకోవడానికి ముందు అమరావతి ప్రజలు, మహిళలు, రైతులకు వైసిపి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిని స్మశానంతో పోల్చిన వైసీపీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అమరావతి రాజధాని అంటుందని ప్రశ్నించారు.
MInister BC Janardhan Reddy Key Comments
మూడు రాజధానుల పేరిట ఐదేళ్ల కాలాన్ని వృధా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల దించు కోవాలన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. అమరావతి మునిగి పోతుందంటూ దుష్ప్రచారం చేసిన నేతలు, నేడు సమర్థించడం వెనుక రాజకీయ దురాలోచన ఏమిటి అని ప్రశ్నంచారు మంత్రి. అధికారం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే తత్వం వైసిపీదని మండిపడ్డారు. వారి వైఖరిని చూస్తే ఈ విషయం మరోసారి రుజువైందన్నారు. జగన్ తత్వమెరిగి గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని అయినా ఇంకా బుద్ది రాలేదన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేత నేడు మనసు మార్చు కోవడం వెనుక ఏ కుటిల రాజకీయం ఉందో ప్రజలకు చెప్పాలన్నారు.
Also Read : Parliement Speaker Om Birla New Innovation : తిరుపతిలో మహిళా సాధికారత సదస్సు
















