CM Chandrababu : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పరంగా దేశానికే రోల్ మోడల్ గా చేస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). శుక్రవారం వే 2 న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2028-29 నాటికి రూ. 29, 29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధిస్తామని చెప్పారు. 2029-2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని స్పష్టం చేశారు సీఎం. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ. 5,42,985 సాధిస్తామని, ఆ నమ్మకం తనకు ఉందన్నారు. 2029-2034 నాటికి తలసరి ఆదాయం రూ. 10,55,000 సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Key Comments
ఇదేమీ అసాధ్యం కాదన్నారు. నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశామన్నారు. మెగా డ్రీమ్స్ ఉండాలని, అంతకు మించిన సంకల్పం ఉంటే సాధించడం ఏమంత పెద్ద కష్టం కాదన్నారు. విజన్ 2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్‌పై ఇంకా అనుమానాలు సరికాదన్నారు. భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమాతరంగా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు నారా చంద్రబాబు నాయుడు. సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి అదే తరహాలో నిధులు ఇస్తున్నామని తెలిపారు. రాజకీయాలు ముఖ్యమే కానీ, ఇదే సమయంలో సమాజం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదని, విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావన్నారు.
Also Read : Congress Shocking Announcement : కామారెడ్డి బీసీ రిజర్వేషన్ సభ వాయిదా
















