Infosys : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) షేర్ మార్కెట్‌లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ రూ.18,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేయనుంది. ఈ నిర్ణయాన్ని గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు ఆమోదించింది.
Infosys – బైబ్యాక్ వివరాలు
- కంపెనీ మొత్తం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 2.41% వాటాకు సమానమైన 10 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.
- ఒక్కో షేరుకు రూ.1,800 చెల్లించనుంది.
- ఇది ఇన్ఫోసిస్ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న అత్యంత భారీ బైబ్యాక్.
- గత మూడు సంవత్సరాల తర్వాత ఇది సంస్థ చేపట్టిన తొలి బైబ్యాక్.
- స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి ఇది ఐదోసారి బైబ్యాక్.
మార్కెట్ పరిస్థితి
బీఎ్‌సఈలో గురువారం ఇన్ఫోసిస్ షేరు ధర 1.51% తగ్గి రూ.1,509.5 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్ ధర 19% అధికంగా ఉంది.
ఈ జూన్ త్రైమాసికం చివరినాటికి కంపెనీ 88.4 కోట్ల డాలర్ల (రూ.7,805 కోట్లు) ఫ్రీ క్యాష్‌ఫ్లో నమోదు చేసింది.
తాజా బైబ్యాక్ ప్రణాళిక అమలుకు వాటాదారుల ఆమోదం కూడా అవసరం.
ఇన్ఫోసిస్ గత బైబ్యాక్‌లు
- 2017: రూ.13,000 కోట్లు – 11.3 కోట్లు షేర్లు – రూ.1,150 ధర
- 2019: రూ.8,260 కోట్లు – 11.05 కోట్లు షేర్లు – రూ.747 ధర
- 2021: రూ.9,200 కోట్లు – 5.58 కోట్లు షేర్లు – రూ.1,649 ధర
- 2022: రూ.9,300 కోట్లు – 6.04 కోట్లు షేర్లు – రూ.1,539 ధర
- 2025: రూ.18,000 కోట్లు – 10 కోట్లు షేర్లు – రూ.1,800 ధర
టీసీఎస్ కూడా బైబ్యాక్‌కు సిద్దమా?
ఇన్ఫోసిస్ తాజా నిర్ణయం నేపథ్యంలో దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ కూడా బైబ్యాక్ ప్రకటన చేయవచ్చని సీఎల్‌ఎ్‌సఏ (CLSA) అంచనా వేసింది.
- 2023 డిసెంబరులో టీసీఎస్ రూ.17,000 కోట్ల బైబ్యాక్ చేసింది.
- 2022లో రూ.18,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.
- తాజా అంచనాల ప్రకారం, ఈ విడత రూ.20,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : SBI Interesting Update : కస్టమర్లకు మంచి శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా



















