Deputy CM Pawan : అనంతపురం జిల్లా : పార్టీలు వేరైనా , భావజాలాలలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా ఒకే వేదికపైకి వచ్చామని జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల (Deputy CM Pawan). బుధవారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ చీఫ్ పీవీఎఎన్ మాధవ్, పవన్ హాజరయ్యారు. వీరితో పాటు మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Deputy CM Pawan Kalyan Comments
రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్ అన్నారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అన్నారు. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ 25 లక్షల ఆరోగ్య భీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ అసాధారణ స్కీం ఏ రాష్ట్రంలో లేదన్నారు. 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడం జరిగిందని చెప్పారు పవన్ కళ్యాణ్. రూ. 1005 కోట్లతో పీఎం జన్ మన్ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ప్రకటించారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయని ప్రకటించారు.
Also Read : MLA Paritala Sunitha Sensational Comments : సూపర్ సిక్స్ బంపర్ హిట్ : పరిటాల సునీత
















