Gold : దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేయదలచిన వారికి మరోసారి షాక్ ఎదురైంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనత, పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తులపై ఆసక్తి పెరగడం వంటి కారణాలతో పసిడి ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి.
Gold – దేశవ్యాప్తంగా బంగారం ధరలు
సెప్టెంబర్ 10, మంగళవారం నాటికి 24 క్యారెట్ల బంగారం (Gold) 10 గ్రాముల ధర రూ. 1,10,300కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,100 వద్ద నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,450, 22 క్యారెట్ల ధర రూ. 1,01,260. హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,10,300, 22 క్యారెట్ల ధర రూ. 1,01,100 వద్ద ఉంది. వడోదరలో మాత్రం ధర స్వల్పంగా ఎక్కువగా ఉండి 24 క్యారెట్ల ధర రూ. 1,10,350, 22 క్యారెట్ల ధర రూ. 1,01,160గా ఉంది.
వెండి ధరల్లో కూడా పెరుగుదల
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్నటితో పోల్చితే కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కేజీ వెండి ధర రూ. 1,39,900గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లో రూ. 1,30,100 వద్ద నమోదైంది.
పెట్టుబడిదారుల దృష్టి పసిడిపైనే
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగడానికి కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : Today Gold Price : నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు



















