Vice Presidential Election : ఢిల్లీ : ఎంతో ఉత్కంఠ రేపుతున్న దేశ ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice Presidential Election Sensational) మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా.. 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. ప్రస్తుతం ఎన్డీయేకి 425, ఇండియా కూటమికి 324 మంది సభ్యుల బలం ఉంది.
Vice Presidential Election Today
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఎన్నిక కంటే ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై నోరు పారేసుకున్నారు. నక్సలైట్లకు మద్దతుగా తను తీర్పు చెప్పారంటూ పేర్కొన్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు రెండు వర్గాలుగా చీలి పోయారు. ఈ మొత్తం వ్యవహారంపై నోరు విప్పారు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, కానీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మరో వైపు ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్ కేఎస్ రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఆయన స్వస్థలం తమిళనాడు. గతంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. ఈ ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీల మధ్య యుద్దానికి దారి తీసింది. బలా బలాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యానికి మత మౌఢ్యానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు మేధావులు. కాగా ఈసారి ఓట్ల తేడా 100–125 మధ్య ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : TTD New EO Interesting : టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్















