CM Chandrababu : అమరావతి : ఏపీలో సంక్షేమం ప్రధానంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకూ దాదాపు రూ.45 వేల కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇచ్చేలా దీపం 2.0 పథకాన్నీ దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. 2.3 కోట్ల ఉచిత గ్యాస్ సిలెండర్లు మహిళల ఇళ్లల్లో వెలుగులు నింపాయని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ ఆర్ధిక సాయం అందిస్తూ అండగా నిలిచామని చెప్పారు సీఎం.
CM Chandrababu Key Comments on Welfare
67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు రూ.13 వేల చొప్పున నిధుల్ని జమ చేశామన్నారు. దీని కోసం రూ.10 వేల కోట్లను కూటమి వెచ్చించడం జరిగిందన్నారు. గతంలో ఒక్కరికి మాత్రమే ఈ సాయం అందేదని, కానీ కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉన్నా వర్తింప చేస్తూ వచ్చామన్నారు. అన్నదాతకు ఆత్మ బంధువుగా నిలుస్తూ 44 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున మూడు విడతలుగా ఆర్ధిక సాయం అందించేలా అన్నదాత సుఖీభవ పథకాన్నీ అమలు చేస్తూ వచ్చామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). గత పాలకులు ఏడాదికి రూ.7,500 విదిలిస్తే.. కూటమి సర్కారు ఒక్క విడతకే రూ.7 వేలను వారి ఖాతాల్లో వేసిందన్నారు.
దీని కోసం రూ.3,200 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నామన్నారు. 5 కోట్ల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు ఈ పథకాన్ని సూపర్ హిట్ చేశారని ప్రశంసించారు. దీని కోసం రూ.2 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీనీ అమలు చేశామన్నారు సీఎం. 15 నెలల కాలంలో దాదాపు రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పారు.
Also Read : PM Modi Important – Bhupen Hazarika : భూపేన్ హజారికా శతజయంతుత్సవాలు
















