Rakesh Arni : హైదరాబాద్ – మిస్టర్ ఇండియా 2025 ప్రతిష్టాత్మకమైన టైటిల్ అవార్డును పొందాడు తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాకు చెందిన పోరగాడు రాకేష్ ఆర్నె (Rakesh Arni). రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచాడు. తన స్వస్థలం నవాబ్ పేట మండలం దర్పల్లి ఊరు. గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్‌లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. తాజాగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాకేష్ తన విజయ గాథను వివరించాడు.
Rakesh Arni gets Mr India Award
తన భవిష్యత్ ఆకాంక్షలను పంచుకున్నారు. త్వరలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. తనకు ముందు నుంచి మూవీస్ అంటే ఇష్టమని పేర్కొన్నాడు. ఇందులో ఎంట్రీ ఇవ్వబోతుండడం పట్ల మరింత ఆనందంగా ఉందన్నాడు. తాను కలలో కూడా మిస్టర్ ఇండియాగా నిలుస్తానని అనుకోలేదని పేర్కొన్నాడు రాకేష్ ఆర్నే.
మిస్టర్ ఇండియాగా గెలుపొందిన తనకు రాబోయే రోజుల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఒక నటుడికి, మోడల్ గా ఎదిగేందుకు కావాల్సిన లక్షణాలన్నీ తనకు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లా పోరగాడు ఈ స్థాయికి ఎదగడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు వచ్చిన డబ్బులతో కొంత సామాజిక కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు రాకేష్ ఆర్నే. తన ఆశయం నెరవేరాలని కోరుకుందాం.
Also Read : Hero Nithin – Tammudu Movie :తమ్ముడు మామూలోడు కాదు



















