Gold : దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. శనివారం నాటికి 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ₹99,450 వద్దకు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ₹1,08,490 దాటింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిగా గుర్తించబడింది.
విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు, అలాగే గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి బంగారం ధరలను ఎగబాకేలా చేస్తున్నాయి.
Gold – రోజు లోపల భారీ పెరుగుదల
శనివారం ఉదయం నుంచి గంటల వ్యవధిలోనే బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.
- 24 క్యారెట్లు (10 గ్రాములు): ₹870 పెరిగి ₹1,08,490 వద్ద కొనసాగుతోంది
- 22 క్యారెట్లు (10 గ్రాములు): ₹800 పెరిగి ₹99,450 చేరుకుంది
దీంతో, 22 క్యారెట్ల బంగారం ధర కూడా లక్ష రూపాయల మార్క్‌కి చేరువైంది.
వెండి కూడా తగ్గేదేలే
బంగారం తరహాలోనే వెండి ధరలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. కిలో వెండి ధర ఒకే రోజు ₹2,000 పెరిగి దేశవ్యాప్తంగా ₹1,28,000 చేరుకుంది. చెన్నై, హైదరాబాద్, కేరళలో అయితే కిలో వెండి ధర ₹1,38,000 వద్ద కొనసాగుతోంది.
నిపుణులు ఆభరణాలు కొనుగోలు చేయదలచిన వినియోగదారులు తాజా ధరలను తప్పనిసరిగా తనిఖీ చేసి, సరైన సమాచారం ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
Also Read : Today Gold Price : రానున్న రోజుల్లో మళ్లీ పెరగనున్న పసిడి ధరలు



















