PVN Madhav : విజయవాడ : ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav). విజయవాడ లోని కృష్ణలంక సత్యం హోటల్ లో చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు చాలా సమస్యలు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని, వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు పీవీఎన్ మాధవ్. అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్య కు ఆయినా పరిష్కారం దొరుకుతుందని ఆ దిశగా చాయ్ పే చర్చా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని చచెప్పారు. తాము ఆయన కొనసాగించిన దానిని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
AP BJP Chief PVN Madhav Key Comments
ప్రజల నాడీ, వారి సమస్యలను తెలుసు కునేందుకు భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టిందన్నారు పీవీఎన్ మాధవ్. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధి పై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వీటిని నోట్ చేసుకుని ఏపీలో కొలువు తీరిన సంకీర్ణ సర్కార్ కు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అంద జేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి విశిష్టత ను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్. భవిష్యత్తు లో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను, వారి ఆలోచనలు, సూచనలు తెలుసు కోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుందన్నారు.
Also Read : Jajula Srinivas Goud Shocking Comments : పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాలి

















