BCCI : ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీం ఇండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఫాంటసీ స్పోర్ట్స్ దిగ్గజాలు డ్రీమ్11 రియల్ మనీ గేమింగ్, క్రిప్టోకరెన్సీలను వ్యవహరించే కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు భారత జట్టు టైటిల్ స్పాన్సర్ గా ఉంది డ్రీమ్ 11 గేమింగ్ కంపెనీ. కేంద్రం దెబ్బకు తాము స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది సదరు సంస్థ. దీంతో బీసీసీఐ (BCCI) టైటిల్ స్పాన్సరర్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించి బిడ్లను ఆహ్వానించడం విశేషం.
BCCI Invites
‘ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టం 2025 కారణంగా డ్రీమ్ 11 ఇటీవల తన రియల్ మనీ గేమ్‌లను మూసి వేసింది. ఎవరూ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలను అందించకూడదు, సహాయం చేయకూడదు, ప్రోత్సహించ కూడదు, ప్రేరేపించ కూడదు, పాల్గొన కూడదు లేదా ఏదైనా వ్యక్తిని ఏదైనా ఆన్‌లైన్ మనీ గేమ్ ఆడటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించే ఏ ప్రకటనలోనూ పాల్గొనకూడదని పేర్కొంది బీసీసీఐ డ్రీమ్ 11 తో పాటు మై11సర్కిల్ సంయుక్తంగా భారత క్రికెట్ జట్టు , ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా బీసీసీఐకి సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరింది.
2025 కింద నిషేధించబడిన ఏదైనా కార్యకలాపాలు, వ్యాపారంలో నిమగ్నమైన దాని గ్రూప్ కంపెనీలతో సహా ఏదైనా బిడ్డర్ బిడ్‌ను సమర్పించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది బీసీసీఐ. పొగాకు, మద్యం, అశ్లీలతతో సహా కాని వాటికే పరిమితం కాకుండా ప్రజా నైతికతను దెబ్బతీసే అవకాశం ఉన్న ఏదైనా సంస్థ కూడా దరఖాస్తు చేసేందుకు వీలు లేదని పేర్కొంది.
Also Read : CM Chandrababu – AP Growth : ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా మారుస్తాం – సీఎం

















