Krishna Water : అమరావతి : రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు (Krishna Water) అనేవి ఇన్నేళ్లూ కలగా ఉండేది. కానీ ఆ కలను నిజం చేశారు చంద్రబాబు నాయుడు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది మొదటి నుంచి తెలుగు దేశం పార్టీ సంకల్పం. సీమలో ప్రాజెక్టులు మొదలు పెట్టింది ఎన్టీఆర్ అయితే వాటిని ముందుకు తీసుకువెళ్లి ఆ కలను నిజం చేసింది మాత్రం సీఎం అని చెప్పక తప్పదు. అతి తక్కువ వర్ష పాతం ఉండే సీమ జిల్లాల్లో నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
Krishna Water Reach Kuppam
ఈ రోజు బీడు భూముల్లో నీళ్లు పారేలా చేశారు. ఇదంతా రాత్రికి రాత్రి ఇది జరగలేదు. 2014 నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధుల ఖర్చు చేయడం వల్ల నేడు హంద్రీనీవా నీళ్లు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి. హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్‌లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు.
Also Read : Allu Aravind Mother Death : నిర్మాత అల్లు అరవింద్ తల్లి కన్నుమూత


















