Smriti Mandhana : హైదరాబాద్ – ప్రముఖ భారతీయ మహిళా స్టార్ క్రికెటర్ , ఇండియా జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తను హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా సుచిత్ర అకాడమీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాలికల క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. యువ మహిళా క్రికెటర్లు తమ నైపుణ్యాలను మెరుగు పరుచు కోవడానికి ఒక బలమైన వేదికను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీతో కలిసి పికిల్‌బాల్ కోర్టును కూడా ప్రారంభించారు.
Smriti Mandhana Starts
సభను ఉద్దేశించి ప్రసంగించిన మంధాన (Smriti Mandhana) అకాడమీ ప్రయత్నాలను ప్రశంసించారు . వినయంగా ఉంటూనే క్రీడను అభిరుచితో స్వీకరించాలని వర్ధమాన క్రీడాకారులను కోరారు . బహుళ క్రీడా విభాగాలలో ప్రతిభను పెంపొందించడంలో విస్తృతంగా గుర్తింపు పొందిన సుచిత్ర అకాడమీ సహ వ్యవస్థాపకులు ప్రదీప్ రాజు , ప్రవీణ్ రాజు ఈ సౌకర్యాన్ని స్థాపించారు. కొత్త అకాడమీ మహిళల క్రికెట్ శిక్షణకు ప్రేరణగా నిలుస్తుందని, నిపుణుల మార్గదర్శకత్వం, అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుందని వారు విశ్వసిస్తున్నారు.
ఈ ప్రారంభంతో సుచిత్ర అకాడమీ క్రీడా విద్యను ప్రోత్సహించడంలో , యువ అథ్లెట్లు రాణించడానికి మార్గాలను సృష్టించడంలో తన నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ సందర్బంగా స్మతీ మంధన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి బాలికల కోసం అకాడమీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల బాలికలకు మరింత రాణించేందుకు వీలు కలుగుతుందన్నారు.
Also Read : Delhi Metro Charges Hike Shocking : ఢిల్లీలో మెట్రో ఛార్జీల మోత



















