Credit Card : సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో, క్రెడిట్ కార్డు (Credit Card) వలె అత్యంత సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని దుర్వినియోగం చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్న ముఠా, సుమారు ₹2.6 కోట్ల మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో 350 మంది బాధితులుగా నమోదు అయ్యారు. కేసు నమోదు అయిన ఆరు నెలల తర్వాత పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో కాల్ సెంటర్ ఉద్యోగులు, ప్రాంతీయ ఏజెంట్లు, సిమ్ కార్డు సరఫరాదారులు, క్రిప్టో వాణిజ్యంతో జతపడ్డ వ్యక్తులు ఉన్నారు.
Credit Card Faruds
ఈ నేపథ్యంలో, ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. క్రెడిట్ కార్డు (Credit Card) మోసాల నుండి రక్షణ పొందేందుకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవే:
1. సున్నితమైన సమాచారం ఎవరికీ ఇవ్వవద్దు
ఓటీపీ, సీవీవీ, పిన్, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చినట్లు చెబుతూ ఎవరైనా ఈ వివరాలు అడిగితే అప్రమత్తంగా ఉండాలి. గుర్తుంచుకోండి – నిజమైన బ్యాంకు ప్రతినిధులు ఇటువంటి సమాచారాన్ని ఎప్పుడూ అడగరు.
2. అసలు కాల్‌లను ధృవీకరించండి
బ్యాంక్ కాల్ అని చెబుతూ సమాచారం అడిగితే, అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న కస్టమర్ కేర్ నంబర్‌కి ఫోన్ చేసి వారి గుర్తింపును ధృవీకరించండి. అనుమానాస్పద కాల్‌లను నమ్మకండి.
3. లావాదేవీలపై నిఘా ఉంచండి
మీ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా లావాదేవీలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించండి. ట్రాన్సాక్షన్ అలర్ట్‌లను మొబైల్‌లో సక్రియ పరచుకోండి. అనుమానాస్పద లావాదేవీ కనిపించిన వెంటనే బ్యాంక్‌ను సంప్రదించండి.
4. సురక్షిత డిజిటల్ వినియోగం
పబ్లిక్ వైఫై ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయకండి. మాల్వేర్ భద్రత కోసం మొబైల్ యాప్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. అనధికార వెబ్‌సైట్ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయొద్దు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండండి.
5. మోసం జరిగితే తక్షణ చర్య తీసుకోండి
క్రెడిట్ కార్డు మోసం అనుమానముంటే, వెంటనే కార్డును బ్లాక్ చేసి బ్యాంక్‌ను సమాచారమివ్వాలి. తరువాత సమీప సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in
) ద్వారా ఫిర్యాదు చేయాలి. వేగంగా స్పందించడం వల్ల నష్టాలను కొంతమేర తగ్గించుకోవచ్చు.
Also Read : Employment Growth : 2వ కోర్టర్ లో భారీగా కొలువుల జాతర



















