CM Revanth Reddy : హైదరాబాద్- గత కొన్ని రోజులుగా 30 శాతం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సినీ కార్మికులకు ఎట్టకేలకు సమ్మె విరమించారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య 18 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన చివరకు ఎట్టకేలకు ముగిసింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో నిరవధిక సమ్మెను విరమించు కుంటున్నట్లు ప్రకటించారు సమాఖ్య అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ప్రకటించారు. హైదరాబాద్‌ను ప్రధాన చలనచిత్ర కేంద్రంగా ప్రోత్సహించాలనే ఆసక్తితో ఉన్నందున, ప్రతిష్టంభన లేకుండా చేయడానికి చొరవ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు.
CM Revanth Reddy Key Updates
తాము నిర్మాతల మండలితో సుదీర్ఘంగా పలుమార్లు చర్చలు జరిపాము. 30 శాతం వేతనాలు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిస్థితిని అర్థం చేసుకున్నాం. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండు స్లాబులకు అంగీకారం తెలియ చేయడం జరిగిందన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు. చివరకు 22 శాతం వేతన పెంపునకు ఓకే చేయాల్సి వచ్చిందన్నారు. రూ. 2,000 కంటే తక్కువ వేతనాలకు మొదటి సంవత్సరంలో 15 శాతం, రెండవ సంవత్సరంలో 2.5 శాతం, మూడవ సంవత్సరంలో 5 శాతం పెంపు ఉంటుందన్నారు.
కాగా రూ. 2 వేలు, రూ. 5 వేలు మధ్య వేతనాలు పొందే కార్మికులకు మొదటి సంవత్సరంలో 7.5 శాతం, రెండో ఏడాదిలో 5 శాతం, మూడో సంవత్సరంలో మరో 5 శాతం పెంచేందుకు అంగీకారం తెలిపామన్నారు. హైదరాబాద్‌ను భారత చలనచిత్ర రాజధానిగా మార్చడానికి నిర్మాతలు , కార్మికులు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని అందుకే తాము సమ్మె విరమించామన్నారు.
Also Read : Macron Important Call to Modi : ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ మోడీకి ఫోన్

















