CM Chandrababu : అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ నాటికి మరో 2 లక్షల ఇళ్లు సిద్ధం చేస్తామని అన్నారు. సెప్టెంబర్‌లో మూడు లక్షల కుటుంబాలు తమ గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించు కోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల యూనిట్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గృహ ప్రవేశ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి ఏ, బీ, సీలుగా వర్గీకరించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు.
CM Chandrababu key Updates on Houses
ఇప్పటికీ ఇళ్లు లేని పేద కుటుంబాల జాబితాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
జాబితా 15 రోజుల్లోపు సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులు నిరాశ్రయుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కూడా గుర్తించాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. పెద్ద కుటుంబాలకు భాగస్వామ్య గృహాలను నిర్మించాలని, ఎన్టీఆర్ గృహ పథకాలను పూర్తి చేయడానికి దశల వారీగా నిధులు సమకూర్చాలని ఆయన సిఫార్సు చేశారు. పీఎంఏవై అర్బన్ , పీఎంఏవై గ్రామమీణ్, పీఎం జనమాన్ కింద రూ. 919 కోట్ల గృహ నిధులు త్వరలో 2,73,709 మంది లబ్దదారులకు చేరుతాయని చెప్పారు సీఎం. వీటిలో ఇప్పటి వరకు 9, 51,351 పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది మాత్రమే 2, 81,000 కొత్త గృహాలు నిర్మించ బడ్డాయని, వచ్చే నెల నాటికి మరో 19,000 ఇళ్లు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : Nikki Haley Fired on Trump : ట్రంప్ నిర్వాకం నిక్కీ హేలీ ఆగ్రహం
















