CP Radha Krishnan : ఢిల్లీ – ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ఎన్డీయే తరపున సీపీ రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. ఆయన ఎంపికను స్వాగతించారు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాది. తొలి జీవితం దీని నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ , అమిత్ షా. ఆయన త్వరలో ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న జగదీప్ ధన్ ఖర్ తనకు ఆరోగ్యం బాగోలేదంటూ రాజీనామా సమర్పించారు. ఆయన స్థానంలో ఇప్పుడు సీపీని ఖరారు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఎవరూ ఊహించ లేదు. కాగా మోదీ వెనుక ఉండి నడిపిస్తోంది ఆర్ఎస్ఎస్. గతంలో సీపీ రాధాకృష్ణన్ (CP Radha Krishnan) తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
CP Radha Krishnan History
సీపీ రాధాకృష్ణన్ కు 40 ఏళ్లకు పైగా రాజకీయ పరంగా అనుభవం ఉంది. రెండుసార్లు ఎంపీగా పని చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా సీనియర్ నాయకులు హాజరైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు తనను ఎన్డీయే అభ్యర్థిగా. సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ . జూలై 31, 2024న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు, ఆయన జార్ఖండ్ గవర్నర్‌గా దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు పని చేశారు. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. 1974లో తమిళనాడులోని భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడయ్యారు. 1996లో భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాధాకృష్ణన్ 1998 , 1999లో కోయంబత్తూర్ నుండి ఎంపీగా గెలుపొందారు రెండుసార్లు.
అంతకు ముందు 2004 నుండి 2007 వరకు తమిళనాడులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఈ సమయంలో ఆయన 93 రోజుల 19,000 కి.మీ రథయాత్రకు నాయకత్వం వహించారు.
Also Read : CM Chandrababu-Pawan Kalya Approved : సీపీ రాధాకృష్ణన్ కు బాబు, పవన్ మద్దతు

















