CM Chandrababu : అమరావతి – ఎడ తెగని ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేసింది మోదీ సర్కార్. ఈ మేరకు జగదీప్ ధన్ ఖర్ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని పూరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం, డిప్యూటీ సీఎంలు. రాధాకృష్ణన్ సమగ్రత, ప్రజా సేవ విలువలను నిరంతరం సమర్థించిన సీనియర్ నాయకుడు అని అభిప్రాయపడ్డారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నాయుడు పేర్కొన్నారు.
CM Chandrababu – Deputy CM Pawan Kalyan Support
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ అయినందుకు రాధాకృష్ణన్‌కు అభినందనలు. సీనియర్ రాజనీతిజ్ఞుడు, గౌరవనీయ నాయకుడు అని ప్రశంసించారు, ఆయన చాలా కాలంగా దేశానికి విశిష్ట సేవలందించారంటూ గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయన నామినేషన్‌ను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నదని, పూర్తి మద్దతును అందిస్తుందని అన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కోయంబత్తూరు నుండి రెండుసార్లు పార్లమంట్ సభ్యుడిగా, జార్ఖండ్ గవర్నర్‌గా , ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు.
Also Read : MP Kiran Kumar Reddy Shocking Comments : యూరియా కొరతపై వాయిదా తీర్మానం















