Rave Party : హైదరాబాద్ – హైదరాబాద్ లోని కొండాపూర్ లో జరిగిన రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో భాగం పంచుకున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కొండాపూర్‌లోని సర్వీస్ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. వీరితో పాటు వీరికి చెందిన ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
Rave Party in Hyderabad – Drugs Seized
స్టేట్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్(స్టేట్ టాస్క్ ఫోర్స్) టీం రేవ్ పార్టీని (Rave Party) భగ్నం చేసింది. కొండాపూర్ ప్రాంతంలో వీకెండ్లలో సర్వీస్ అపార్ట్మెంట్లలో మద్యం విందు, డ్రగ్స్ వినియోగం, అమ్మాయిలతో డాన్సులతో చిత్ర విచిత్రమైన పార్టీలు జరుగుతున్నాయని పక్కా సమాచారం పోలీసులకు అందింది. ఈ దాడులను సీఐ సంధ్య ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ టీం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని ముఠాలుగా ఏర్పడి వీకెండ్లలో ఇక్కడికి తీసుకు వస్తారు.
విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం, రాయుడు అనే వ్యక్తులు నకిలీ బ్యాంక్ అకౌంట్లు, నకిలీ ఆధార్ కార్డులతో ధనవంతులను ఆకర్షిస్తున్నట్లు సంధ్య చెప్పారు. గత కొంత కాలంగా ఈ తతంగం కొనసాగుతోందన్నారు. కాగా తప్పించుకున్న వారిలో రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్‌కుమార్ అలియాస్ మన్నే, ఆర్గనైజర్ అప్పికోట్ల అశోక్‌కుమార్, సమ్మెల సాయి కృష్ణతో పాటు పలువురు ఉన్నారని ప్రకటించారు సంధ్య. 11 మందిపై కేసు నమోదు చేశామన్నారు. 2 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల ముష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్ , 11 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
Also Read : DGCA Fired on Air India : ఎయిర్ ఇండియా వైఫల్యం డీజీసీఏ ఆగ్రహం
















