చెస్ మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద‌కు రూ. 50 ల‌క్ష‌ల న‌గ‌దు

బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్

hellotelugu-CMVijayAnnounce

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ గ్రాండ్ మాస్ట‌ర్ రాష్ట్రానికి చెందిన ప్ర‌జ్ఞానంద‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. సోమ‌వారం త‌న కార్యాల‌యంలో నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ‘నార్వే చెస్ 2026’ సిరీస్‌లో విజేతగా నిలిచి చారిత్రాత్మక మైలురాయిని నెలకొల్పిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను అభినందించారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను శాలువాతో స‌త్క‌రించారు. వారి త‌ల్లిదండ్రుల‌ను కూడా ప‌ల‌క‌రించారు ప్రేమ పూర్వ‌కంగా.

అంతే కాకుండా త‌మిళ‌నాడు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ సంస్థ , ప్ర‌భుత్వం త‌ర‌పున చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ కు రూ. 50 ల‌క్ష‌ల చెక్కును బ‌హుమ‌తిగా అంద‌జేశారు. అంతే కాకుండా సీఎం జోసెఫ్ విజ‌య్ ప్ర‌జ్ఞానంద‌తో క‌లిసి చెస్ గేమ్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచిన ప్ర‌జ్ఞానంద‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.

ఇక ప్ర‌జ్ఞానంద అసలు పేరు రమేశ్‌బాబు ప్రగ్ఞానందా . త‌ను ఆగ‌స్టు 10, 2005లో చెన్నైలో పుట్టాడు. 10 సంవత్సరాల వయస్సులోనే ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. 2018లో 12 సంవత్సరాల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించాడు . ప్రపంచ చెస్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 2025లో టాటా స్టీల్ చెస్ టోర్నీ విజేత‌గా నిలిచాడు. భారతదేశం నంబర్-1 చెస్ ఆటగాడిగా ఎదిగాడు . ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-4లోకి చేరాడు. ఇక ఈ ఏడాది 2026లో నార్వే చెస్ టోర్నీ విన్న‌ర్ గా నిలిచిన తొలి భార‌తీయుడిగా గుర్తింపు పొందాడు.

Exit mobile version