Crypto Scam : సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రిప్టోకరెన్సీ (Crypto Scam) ఎక్స్ఛేంజ్ CoinDCX వేదికగా జరిగిన భారీ హ్యాకింగ్ ఘటనను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ వాలెట్ల నుంచి సుమారు 44 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.384 కోట్లు) ఖాతాల్లోంచి ఖచ్చితమైన ప్రణాళికతో మాయం చేశారు.
Crypto Scam – జూలై 19న అనుమానాస్పద చర్యలు
CoinDCX సాంకేతిక బృందం జూలై 19న వారి వ్యవస్థల్లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించింది. ప్రారంభంగా కేవలం 1 USDT (డిజిటల్ డాలర్ సమానమైన క్రిప్టో కరెన్సీ) విలువైన చిన్న బదిలీ చేసి, ఆపై కొద్ది గంటల్లోనే భారీగా 44 మిలియన్ డాలర్ల విలువైన ట్రాన్సాక్షన్‌ను హ్యాకర్లు నిర్వహించారు. దొంగిలించిన క్రిప్టోను చిన్న చిన్న మొత్తాల్లో బహుళ వాలెట్లకు పంపించడంతో దానిని ట్రాక్ చేయడం కష్టమైంది.
ఉద్యోగిపై అనుమానాలు – అరెస్ట్
పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో సంస్థలో పనిచేసిన రాహుల్ అగర్వాల్ అనే ఉద్యోగిపై అనుమానం వ్యక్తం చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన కంపెనీకి చెందని ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తూ ఫ్రీలాన్స్ పనుల ద్వారా రూ.15 లక్షల ఆదాయం సంపాదించినట్లు సమాచారం. అతను హ్యాకర్లకు లోపల నుంచి సహకరించిన సూచనలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
సైబర్ క్రైమ్ విభాగం నిపుణులు ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలతో కలిసి నిధుల మార్గాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగిలించబడిన క్రిప్టో మొత్తాన్ని తిరిగి పొందేందుకు సాంకేతిక విశ్లేషణ కొనసాగుతోంది. CoinDCX సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది.
Also Read : Stock Market Growth : స్వల్ప లాభాల్లో నడుస్తున్న సూచీలు


















