Afghanistan Cricketers Death : పాకిస్తాన్ వైమానిక దాడుల్లో ఆఫ్గాన్ క్రికెట‌ర్లు మృతి

ముగ్గురు క్రికెట‌ర్ల మృతిపై ఆఫ్గ‌నిస్తాన్ స‌ర్కార్ ఫైర్

Hello Telugu - Afghanistan Cricketers Death

Hello Telugu - Afghanistan Cricketers Death

Afghanistan : ఆఫ్గ‌నిస్తాన్ : పాకిస్తాన్ జ‌రిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన క్రికెట‌ర్లు మృతి చెందారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఆఫ్గాన్ ప్ర‌భుత్వం. అంత‌కు అంత బ‌దులు తీర్చుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా బాధితులకు గౌరవ సూచకంగా వచ్చే నెలలో జరగనున్న ట్రై-సిరీస్ నుండి వైదొలగాలని నిర్ణయించినట్లు ఆఫ్గ‌నిస్తాన్ (Afghanistan) క్రికెట్ బోర్డు (ఏసీబీ) స్ప‌ష్టం చేసింది. దాడుల్లో మృతి చెందిన క్రికెట‌ర్లు క‌బీర్, సిబ్ఘ‌తుల్లా, హ‌రూన్ ల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించింది. కాగా ఈ దాడిలో మ‌రో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది స‌ర్కార్. ఈ ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డింది.

Afghanistan Cricketers Death

వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకతో జరగనున్న మూడు దేశాల‌ సిరీస్ నుండి వైదొలిగిందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. స్నేహపూర్వక మ్యాచ్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు ఉర్గున్ నుండి పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని షరానాకు ప్రయాణించారని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించిన పిరికి దాడిగా అభివర్ణించింది. ఈ ఘ‌ట‌న‌ ఆఫ్ఘనిస్తాన్ క్రీడా సమాజానికి, దాని అథ్లెట్లకు, క్రికెట్ కుటుంబానికి గొప్ప నష్టంగా భావిస్తోంది అని పేర్కొంది. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోంది అని స్ప‌ష్టం చేసింది. ఈ అణచివేతలు అమాయక పౌరులు, దేశీయ క్రికెట్ ఆటగాళ్లను ఊచకోత కోయడం దారుణమైన, క్షమించరాని నేరం అని ఆఫ్ఘన్ అంతర్జాతీయ క్రికెటర్ ఫజల్‌హాక్ ఫరూఖీ పేర్కొన్నారు.

Also Read : CM Revanth Reddy Clear Instructions : పేద పిల్ల‌ల‌కు మెరుగైన విద్య అందించాలి : సీఎం

Exit mobile version