హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు హంగ్ కాకుండా మొత్తం 17 పురపాలిక స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 116 స్థానాలకు గాను బీఆర్ఎస్ ఎల్లంపేట,
అలంపూర్ , జమ్మికుంట, సిరిసిల్ల, ఇస్నాపూర్ , తూఫ్రాన్ , గజ్వేల్ , దుబ్బాక, రాయికల్ , ఆసిఫాబాద్ , అయిజ, గుమ్మడిదల, జిన్నారం, గడ్డి పోచారం, మూడు చింతలపల్లి, చేర్యాల, తిరుమల గిరి మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగుర వేసింది.
ఇదిలా ఉండగా ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో మరో 5 మున్సిపాలిటీలు క్యాతనపల్లి, ఇంద్రేశం, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం, జనగామ, తొర్రూరు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయా హంగ్ ఏర్పడిన స్థానాలలో ముందస్తుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయా స్థానాలలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు గాను ఇంఛార్జ్ లను నియమించారు కేటీఆర్.
