జగిత్యాల జిల్లా : పార్టీకి సంబంధించిన ఫండ్ ను దుర్వినియోగం చేసిందని, తమకు వివరాలు ఇవ్వడం లేదంటూ జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫండ్ మెక్కేసిందంటూ ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల పార్టీ ఫండ్‌పై భారీ ఆరోపణలు చోటు చేసుకున్నాయి. లెక్కలు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. 50 వార్డులకు గాను 46 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే.. ఒక్కొక్కరికి ₹2,15,000 రావాల్సి ఉండగా పూర్తి మొత్తం ఇవ్వకుండా కొందరికి రూ.50,000, మరికొందరికి రూ.1 లక్ష మాత్రమే భోగ శ్రావణి ఇచ్చిందని ఆరోపించారు.
రాష్ట్ర కార్యాలయానికి అభ్యర్థులు ఇప్పటికే ఫిర్యాదు చేయగా నిజ నిర్ధారణ కమిటీ జగిత్యాలలో విచారణ చేపట్టిందని సమాచారం. ప్రచారానికి కూడా సహకారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్థులు బోగ శ్రావణిపై. పార్టీ పరంగా వచ్చిన పూర్తి నిధుల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. భోగ శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కౌన్సిలర్ అభ్యర్థులు. ఇదిలా ఉండగా ఆమె చేసిన నిర్వాకం గురించి ఆరోపణలు చేయడం పట్ల ఇప్పటి వరకు పార్టీ హైకమాండ్ నుంచి ఇంకా స్పందన రాలేదు.
