న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ. పీఎం ఏడాది లోగా అధికారంలో ఉండరని జోష్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజా ఒత్తిడిని అణచివేసి, అత్యవసర పరిస్థితి వంటిదాన్ని విధించడానికి ప్రయత్నించవచ్చని ఆరోపించారు. ఇదిలా ఉండగా మోదీ అధికారంలో ఉండరన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వాదనపై బీజేపీ గురువారం ఎదురుదాడి చేసింది. ఆయన ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దేశంలో విధించిన ఏకైక అత్యవసర పరిస్థితిని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన గాంధీ ఒకప్పుడు ఆయన నియంత్రించిన వ్యవస్థ ఇప్పుడు అంతర్గతంగా కదిలి, కుప్ప కూలుతోంది కాబట్టి ఏడాదిలోగా మోదీ ప్రధానిగా ఉండరని పేర్కొన్నారు.
మమత రాజకీయ సామ్రాజ్యం అద్భుతమైన పతనం ప్రకటన మోడీ ప్రభుత్వం ప్రజా ఒత్తిడిని అణచివేసి, ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని విధించడానికి ప్రయత్నించ వచ్చని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత చరిత్రను, మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. రాహుల్ గాంధీకి ఎమర్జెన్సీ చరిత్ర ఉన్న కుటుంబం నుండి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ విధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన నమ్ముతున్నారని అన్నారు. భారతదేశంలో రాజ్యాంగం ఒక్కసారి మాత్రమే ఉల్లంఘించబడింది, అది ఇందిరా గాంధీ ద్వారా జరిగిందన్నారు. ఆమె రాజ్యాంగ సంస్థలను ఎలా బలహీనపరిచిందో, వాటిలో ఎలా జోక్యం చేసుకుందో అందరికీ తెలిసిందేనని ఇంకొకరు చెప్పాల్సిన పని లేదన్నారు.
















