Telangana : హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. వీటిని మూడు దశలలో ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఇక జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికలను రెండు దశలలో నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తంగా రూ. 350 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది ఈసీ. దీంతో సర్కార్ ముందస్తుగా రూ. 3.08 కోట్లు రిలీజ్ చేసింది. ఈ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనుంది. రాష్ట్రంలోని 1, 67, 03, 168 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకుంటారని ప్రకటించింది. 12 వేల 760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 1,12,534 వార్డులు ఉన్నాయి. 5,763 ఎంపీటీసీ స్థానాలతో , 565 జెడ్పీటీసీ స్థానాలలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇక 565 ఎంపీపీలు, 31 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థానాలకు పరోక్షంగా జరుగుతాయి.
Telangana Panchayat Elections Update
ఇక రిజర్వేషన్ల కేటగిరీల వారీగా చూస్తే ఎస్టీలున్న పంచాయతీలు 1,248 ఉండగా ఎస్టీలకు సంబంధించి 1,289 , ఇతర ప్రాంతాలకు సంబంధించి 10,223 ఉన్నాయని పేర్కొంది ఈసీ. ఈ ఎన్నికల్లో 11 గుర్తింపు పొందిన పార్టీలతో పాటు 31 నమోదు పార్టీలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొంటాయి. ఇక ఈసీ ప్రకటించిన ఓటర్లలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడం విశేషం. 1,67,03,168 మంది ఓటర్లలో 85 , 36, 770 మంది మహిళలు ఉండగా 81,65,894 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 504 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపింది ఈసీ. రాష్ట్రంలో 31 వేల 377 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 1,118,547 బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసినట్లు తెలిపింది.
Also Read : CM Revanth Reddy Shocking : ఉద్యోగుల జీతాల్లోంచి 10 శాతం పేరెంట్స్ కోసం

















