YS Vijayamma : చెన్నై : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తన తల్లి వైఎస్ విజయమ్మకు అనుకూలంగా తీర్పు చెప్పింది ఎన్సీఎల్టీ బెంచ్. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29న జగన్ రెడ్డికి మేలు చేకూర్చేలా ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ విజయమ్మ చెన్నై బెంచ్ లో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. విజయమ్మకు (YS Vijayamma ) చెందిన పూర్తి షేర్స్ పై యధాతథా స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
YS Vijayamma Shocking YS Jagan
ఇదిలా ఉండగా సరస్వతి సిమెంట్స్ వాటా వివాదం గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తోంది కొడుకు, తల్లి విషయంలో. విజయమ్మ తన కుమార్తె వైఎస్ షర్మిలకు చట్టవి రుద్ధంగా వాటాలను బదిలీ చేశారని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కుటుంబంలో వివాదానికి ఇది కేంద్ర బిందువుగా మారింది. షేర్లను తన పేరు మీద బదిలీ చేయాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తనకు ఫేవర్ గా తీర్పు రావడంపై మండిపడ్డారు విజయమ్మ. ఆమె చెన్నై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా న్యాయవాద బృందం అన్ని వాటా బదిలీలు చట్టబద్ధంగా జరిగాయని వాదించింది. జస్టిస్ ఎన్. శేషసాయి, సాంకేతిక సభ్యుడు జతినేంద్రనాథ్‌లతో కూడిన ధర్మాసనం విజయమ్మ వాదనను సమర్థించింది, ప్రస్తుత యథాతథ స్థితిని కొనసాగిస్తూ వివాదాస్పద వాటాలపై ఆమె నియంత్రణను నిలుపు కోవడానికి వీలు కల్పించింది.
Also Read : KCR Gives B-Form Maganti Sunitha Interesting : మాగంటి సునీతకు బి – ఫామ్ అందించిన కేసీఆర్


















