YS Sharmila : విజయవాడ – మహా నాయకుడు, దివంగత ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా హైదరాబాద్ లో వైఎస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). మంగళవారం ఆమె సుదీర్ఘ లేఖలు రాశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రవేంత్ రెడ్డికి, ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీకి. ఈ దేశంలో ఎవరూ , ఏ నాయకుడు చేయలేనన్ని సంక్షేమ పథకాలను తీసుకు వచ్చాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన చరిత్ర తన తండ్రి వైఎస్సార్ దని పేర్కొన్నారు షర్మిల.
YS Sharmila Write a Letter to Telangana CM..
ఇవాళ ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. జల యజ్ఞం, ఆరోగ్య శ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు నేటికీ పేదలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు ఏపీపీసీసీ చీఫ్. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల గుండెల్లో YSRది చెరిగి పోని ముద్ర వేశారని తెలిపారు. మహానేత మరణించి 16 ఏళ్లు దాటినా ఆయన వర్ధంతి, జయంతి వేడుకలకు నివాళులు అర్పించేందుకు తెలంగాణ రాష్ట్రంలో మెమోరియల్ లేక పోవడం బాధాకరమని పేర్కొన్నారు.
YSR మరణానంతరం అనాడు మెమోరియల్ ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని AICC అగ్రనేత సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి విన్నవించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
Also Read : Home Minister Anitha Warning : మహిళలను కించపరిస్తే ఊరుకోం – అనిత
















