YS Sharmila : విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. ఓ వైపు లేదు లేదంటూనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు లోపాయికారిగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే టెండర్లు కూడా పిలిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో విశాఖ ఉక్కు పరిశ్రమపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో షర్మిల (YS Sharmila) పాల్గొని ప్రసంగించారు. ఆరు నూరైనా సరే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.
YS Sharmila Slams YS Jagan, Pawan Kalyan, CM Chandrababu
ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ గురించి ఎన్నో చెప్పాడని, కానీ ఇప్పుడు సీఎంగా కొలువు తీరాక మరిచి పోయాడని ఆరోపించారు. ఈ ముగ్గురు నేతలు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఊడిగం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన మద్దతు తోననే విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. TDP, జనసేన బీజేపీ నీ ఎత్తి పట్టుకుందని, YCP అనధికారికంగా బీజేపీ నీ మోస్తోందని అందరూ కలిసి ఏపీని సర్వ నాశనం చేస్తున్నారంటూ వాపోయారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో అందరూ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షం అంటూ గగ్గోలు పెట్టే జగన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం పట్ల మండిపడ్డారు.
Also Read : Sajjala Fired on CM Chandrababu : జేబులు నింపు కోవడం కోసం బాబు అమరావతి జపం

















