YS Sharmila : అమరావతి : కడలిని ఆధారంగా చేసుకొని, తీరాన్ని ఆవాసంగా మార్చుకుని, ప్రమాదాలకు వెరవక గంగమ్మను, కాయకష్టాన్ని నమ్ముకుని, ప్రజలకు మత్స్య సంపదను అందిస్తూ బ్రతుకు సాగిస్తున్న మత్స్యకార కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). చేపల వేటే జీవనాధారం చేసుకొనే బ్రతికే గంగ పుత్రుల సంక్షేమం పై గత 11 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నది మోసమేనని వాపోయారు. రాజకీయం కోసం తప్పా మత్స్యకారులకు YCP, కూటమి ప్రభుత్వాలు భరోసా కల్పించిన పాపాన పోలేదంటూ మండిపడ్డారు. మత్స్యకార వికాసం, ప్రగతి ప్రకటనలకే పరిమితం అయ్యిందన్నారు.
YS Sharmila Shocking Comments on AP Govt
గంగపుత్రుల కాలనీల్లో నేటికి గుక్కెడు త్రాగునీళ్లకు కష్టంగా మారిందన్నారు షర్మిలా రెడ్డి. మత్స్యకార బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు దిక్కు లేకుండా పోయిందన్నారు. కూటమి సర్కార్ అబద్దాలు చెప్పడం తప్పితే వారికి సరైన భరోసా కల్పించక పోవడం దారుణమన్నారు ఏపీపీసీసీ చీఫ్. ప్రధానంగా చేపల వేట కోసం వెళ్లే వారి పరిస్థితి అత్యంత కష్టంగా ఉంటుందన్నారు. ఒక్కసారి బయటకు వెళితే ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని దుస్థితి ఉంటుందని, ఒక్కోసారి తెలియక నిర్దేశించిన లైన్ దాటితే ఇతర దేశాలకు చెందిన వారి చేతిలో బందీ అయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఇకనైనా కూటమి సర్కార్ గంగపుత్రులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
Also Read : MLA Bandla Krishna Mohan Shocking Comments : నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా : బండ్ల
















