YS Sharmila : అమరావతి : యావత్ తెలుగు జాతికి ఇవాళ చీకటి రోజు అని పేర్కొన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ తెలుగు జాతికి తీరని ద్రోహం చేశారంటూ వాపోయారు. మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ పడితే ఒక్క తెలుగు ఎంపీ అయినా నోరు విప్పక పోవడం, మద్దతు ప్రకటించక పోవడం దారుణమన్నారు. RSS వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులుగా మిగిలి పోతారని మండిపడ్డారు.
YS Sharmila Slams YS Jagan
తెలుగు ప్రజల ప్రయోజనాల కన్నా స్వలాభమే ధ్యేయంగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు.
మత పిచ్చి మోడీకి మోకాళ్లు వత్తడమే లక్ష్యంగా పని చేశారని ఆరోపించారు షర్మిలా రెడ్డి. టీడీపీ, వైసీపీ, జనసేన చేసిన నీచ రాజకీయాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ కు ఓటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలుగు బిడ్డ, న్యాయ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయక పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తెలుగు పార్టీలు తెలుగు బిడ్డకు మద్దతుగా నిలవక పోవడం అత్యంత దురదృష్టకరం అన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానం అని వాపోయారు. పోటీలు పడి మోడీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టిందంటూ ప్రశ్నించారు.
Also Read : India Railways Interesting Update : ప్రయాణికులకు దీపావళికి అదిరిపోయే బహుమతి
















