YS Sharmila : అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమికి చెందిన టీడీపీ, జనసేన పార్టీలతో పాటు జగన్ రెడ్డికి చెందిన ఎంపీలంతా బీజేపీకి బానిసలని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజలే వీరికి మిన్న అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర హక్కుల కన్నా.. మోడీ మెప్పు మిన్న. పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదన్నారు. తమ నోరును హక్కుల కోసం కాకుండా పీఎం జపానికి మాత్రమే వాడతారంటూ మండిపడ్డారు.
YS Sharmila Shocking Comments TDP MP’s
నమ్మి ఓటేస్తే మతపిచ్చి పార్టీకి ఊడిగం తప్పా ఉద్ధరించింది శూన్యం అన్నారు షర్మిల రెడ్డి (YS Sharmila). మోడీ చేతిలో 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు రబ్బర్ స్టాంప్స్ గా మారి పోయారని అన్నారు. బీజేపీ కోసం పని చేసే కీలుబొమ్మలు. హోదాపై అడిగే దమ్ములేదన్నారు. రాజధానికి నిధులు అడిగే సత్తా లేదన్నారు. పోలవరాన్ని ముంచుతుంటే ఎదురు తిరిగే ధైర్యం లేదన్నారు. అడ్డికి పావుసేరు కింద విశాఖ స్టీల్ ను అమ్ముతున్నా ఒక్కరు కూడా నోరు మెదపడం లేదన్నారు షర్మిలా రెడ్డి. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులపై గళం విప్పకుండా.. బీజేపీ అక్రమ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్పా మన ఎంపీలకు ఏమి చేత కాదన్నారు.
రాష్ట్ర ఎంపీలకు దమ్ము, ధైర్యం, పౌరుషం అనేది ఉంటే ఈ రాష్ట్ర బిడ్డలే అయితే.. మీలో పారుతుంది చీము నెత్తురే అయితే.. మోడీ తొత్తులు కాదనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే మీకు ముఖ్యం అనుకుంటే.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయాలని డిమాండ్ చేశారు.
Also Read : MP Eatala Rajender Shocking Comments : బండి సంజయ్ పై ఈటల మాటల తూటాలు


















