YS Sharmila : విజయవాడ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంటలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). అకాల వర్షాల దెబ్బకు రాష్ట్రంలో .50 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. వేలాది మంది రైతులు రోడ్డు పాలయ్యారని వాపోయారు. శనివారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం పడ్డ శ్రమ కళ్ళ ముందే నీళ్ల పాలవుతుంటే, పంట చేతికొచ్చే సమయంలో వానలు రైతన్న పొట్ట కొడుతుంటే ఆపన్న హస్తం అందించాల్సిన కూటమి ప్రభుత్వం తమకేం పట్టనట్లు వ్యవహరించడం దారుణం అన్నారు. రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న చందంగా తయారైందన్నారు. వ్యవసాయం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు షర్మిలా రెడ్డి.
YS Sharmila Key Comments on Farmers
పంట పండినా, మునిగినా, ఎండినా కష్టమే అన్నట్లుంది రాష్ట్ర రైతాంగం తీరు అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ మీద ఉన్న శ్రద్ద, ప్రేమ రైతులపై, వ్యవసాయ రంగంపై లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కోట్లాది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టేది అన్నదాతలని, ఆ విషయం మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. రైతు సౌభాగ్యం పేరుకే. అన్నదాతకు భరోసా అంతా బూటకమేనంటూ ఆరోపించారు. పరిహారం అంతా పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు 22 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
Also Read : Popular Composer Singhvi : లైంగిక వేధింపులో కేసులో కంపోజర్ సింఘ్వీ అరెస్ట్

















