YS Jagan : తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చాక రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి (YS Jagan). చంద్రబాబు సృష్టించిన మరో విపత్తు ఇదని మండిపడ్డారు. తమ సర్కార్ హయాంలో ఉచిత పంటల బీమాను అందించామన్నారు. 85 లక్షల రైతులకు, 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్ వర్తింప చేశామన్నారు జగన్ రెడ్డి. రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించామన్నారు. తమ 5 ఏళ్ల కాలంలో 54.55 లక్షల రైతులకు రూ.7802 కోట్ల పరిహారం దక్కిందన్నారు. ఇదంతా తాము తీసుకున్న ముందు చూపు నిర్ణయం వల్ల జరిగిందని తెలిపారు మాజీ సీఎం. ఇప్పుడు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా వర్తింప చేశారని ఆరోపించారు. రుణాలు తీసుకున్న 19 లక్షల రైతులకే బ్యాంకులు బీమా కల్పించాయని వాపోయారు. మరి మిగిలిన రైతులందరి పరిస్థితి ఏమిటి అని చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.
YS Jagan Slams CM Chandrababu
గత రెండేళ్లుగా ఏ సీజన్‌లోనూ ప్రీమియం కట్టిన పాపాన పోలేదన్నారు జగన్ రెడ్డి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ఇది పూర్తిగా ‘మ్యాన్ మేడ్ కలామిటీ’ తప్పా మరోటి కాదన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులు, నేతలకు పిలుపునిచచ్చారు . పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగ వద్దని కోరారు. ప్రభుత్వం తప్పిదానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకోవాలని అన్నారు. రైతులు, ప్రజలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి. రైతులకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకం రావడం లేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. అన్నదాత సుఖీభవలోనూ మోసం జరుగుతోందని వాపోయారు. ఈ–క్రాప్‌కు మంగళం పాడారని, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు.
Also Read : Popular Patel – MP Eatala Rajender : ఘనంగా పటేల్ 150 జయంతి వేడుకలు

















