YS Jagan : అమరావతి – ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సర్కార్ పనితీరు దారుణంగా ఉందన్నారు. పాలనా పరంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘోరంగా వైఫల్యం చెందాడని ఆరోపించారు. ఆయన నిర్వాకం కారణంగా రోజు రోజుకు రాష్ట్రం అప్పుల ఊబిలోకి చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న అప్పులను ఎలా తగ్గించు కోవాలనే సోయి లేకుండా పోయిందన్నారు జగన్ రెడ్డి (YS Jagan). ఈ సందర్బంగా పాలనా నమూనాను పునరాలోచించు కోవాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. చంద్రాబు చేతకాని తనం వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) పూర్తిగా తన నివేదికలో బహిరంగం చేసిందన్నారు. అయినా సీఎంలో స్పందన లేకపోవడం దారుణమన్నారు జగన్ రెడ్డి.
YS Jagan Slams NDA Govt
మాజీ ముఖ్యమంత్రి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ ఆర్థిక క్రమశిక్షణకు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదాయ వృద్ధి బాగా మందగించిందని, అప్పులు రాకెట్ కంటే స్పీడ్ గా పెరుగుతున్నా చలనం లేకుండా ప్రవర్తించడం చంద్రబాబు నాయుడుకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా 2024–25లో రాష్ట్ర సొంత ఆదాయాలు , పన్ను, పన్నుయేతర ఆదాయాలు సహా కేవలం 3.08 శాతం మాత్రమే పెరిగాయని గుర్తు చేశారు. గత ఏడాదిలోనే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ ధోరణి కొనసాగిందని వైసీపీ బాస్ హైలెట్ చేశారు.
Also Read : Hyderabad Traffic Block : 27 వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

















