YS Jagan : హైదరాబాద్ : భారీ బందోబస్తు మధ్య వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) గురువారం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసు విచారణకు సంబంధించి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. గతంలో కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ నోటీసులు పలుమార్లు ఇచ్చినా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా పట్టించుకోలేదు. ఏవో కుంటి సాకులు చెప్పడం, తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని పేర్కొనడంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వైఎస్ జగన్ రెడ్డి ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు.
YS Jagan Visited Nampally Court
అంతకు ముందు ఆయనను చూసేందుకు, స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, నేతలు హాజరయ్యారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లోని అక్రమ ఆస్తుల (డీఏ) కేసులపై సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టుకు గట్టి భద్రత మధ్య హాజరయ్యారు. జగన్ మొదట విజయవాడ నుండి బేగంపేట విమానాశ్రయంలో దిగి, తరువాత రోడ్డు మార్గంలో కోర్టుకు వెళ్లారు. నవంబర్ 21న లేదా అంతకు ముందు సీబీఐ దర్యాప్తు చేస్తున్న డీఏ కేసు విచారణకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు ఆయన హాజరయ్యారు. మినహాయింపు కోసం జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది . కాగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కోర్టు సముదాయంలోకి బయటి వ్యక్తులను అనుమతించలేదు.
Also Read : KTR Challenge : ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు


















