YS Jagan : వైఎస్సార్ కడప జిల్లా – దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2న వర్దంతి. ఈ సందర్బంగా వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ జనసంద్రంతో, అభిమానులతో నిండి పోయింది. ఎక్కడ చూసినా వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు మిన్నంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగగా ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు వైఎస్ కుటుంబ సభ్యులు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
YS Jagan Tweet
ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం మొత్తం ప్రజల కోసం, సంక్షేమం కోసం పని చేశారని గుర్తు చేసుకున్నారు. తానకు ఆయనకు కొడుకుగా పుట్టినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని అన్నారు . ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాతగా నిలిచి పోయారని చెప్పారు జగన్ రెడ్డి.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో జగన్ రెడ్డితో పాటు తన సతీమణి వైఎస్ భారతీ రెడ్డి, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
Also Read : Pawan Kalyan Birthday Wishes Sensational : పడి లేచిన కెరటం పవన్ కళ్యాణ్


















