YS Jagan : అమరావతి : మొంథా తుపాను తాజాగా ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఏకంగా 20 లక్షలకు పైగా పంటలను కోల్పోయారు రైతులు. అంతే కాదు వేల కోట్లకు పైగా అన్ని విభాగాలలో నష్టం వాటిల్లిందని ఇప్పటికే ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ తరుణంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) కృష్ణా జిల్లాలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు. నిరాశ్రయులైన వారిని పరామర్శించారు. ఆయన పర్యటన సందర్భంగా పోలీసులు కొందరికే పర్మిషన్ ఇచ్చారు. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ.
YS Jagan Slams AP Govt
మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి రెడ్డి తన యాత్రను ప్రారంభించారు. దారి పొడవునా ఆయనను కలిసేందుకు జనం బారులు తీరారు. అడుగుడుగనా ఆయన వారందరిని పలకరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర వ్యాప్తంగా విరుచుకు పడిన తీవ్రమైన తుఫాను తుఫాను తర్వాత ఈ పర్యటన కు శ్రీకారం చుట్టారు జగన్ రెడ్డి. దీని కారణంగా వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి . కనీసం రూ. 5,244 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ సందర్బంగా జగన్ రెడ్డి మీడియతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయడంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు. బాధితులకు భరోసా కల్పించడంలో విఫలం చెందిందని ఆరోపించారు.
Also Read : MLA Kolikapudi Shocking : విచారణకు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి


















