YS Jagan : అమరావతి – ఏపీలో కూటమి పాలనపై యుద్దం ప్రకటించాడు వైఎస్సార్సీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). ఇంకా నాలుగు ఏళ్ల సమయం ఉంది. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇప్పటికే ఆ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తోంది.
YS Jagan Comments
ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరో వైపు అన్నాడీఎంకేతో మరోసారి పొత్తు పెట్టుకుంది తమిళనాడులో. అక్కడ ఎక్కువగా ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొనే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రముఖ నటుడు, అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనుంది.
మరో వైపు తెలంగాణలో సైతం పాలిటిక్స్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నా తను బీజేపీకి దగ్గరగా ఉంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు జగన్ రెడ్డి. ఎలాగైనా సరే వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు.
ఇందులో భాగంగా తాజాగా సంచలన ప్రకటన చేశాడు. త్వరలోనే ప్రజల్లోకి వెళతానంటూ ప్రకటించాడు. ఇందులో భాగంగా ఇప్పటికే 100 నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. టికెట్లు పొందిన వారిలో వల్లభనేని వంశీ, పేర్నినాని, కొడాలి నాని, అబ్బయ్య చౌదరి, నందిగం సురేష్, కాకాణి గోవర్దన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, విడదల రజిని, పెద్దారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, కేతిరెడ్డి సీట్లు పొందిన వారిలో ఉన్నారు.
Also Read : Minister Atchannaidu Interesting Comments : అభివృద్దిలో ఏపీని రోల్ మోడల్ చేస్తాం – అచ్చెన్న















