War 2 : అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’. ఈ మూవీని ఆగస్ట్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాదిలో అందరూ ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ల్లో ‘వార్ 2’ కూడా ఒకటి. ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ మూవీ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వార్ 2’ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. ఇక తాజాగా ‘వార్ 2’ డబ్బింగ్ పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ కోసం డబ్బింగ్ చెబుతున్నారు.
War 2 Movie Updates
ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ ‘వార్ 2’ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా రాబోతోంది. ‘వార్ 2’లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో అడ్రినలిన్-పంపింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోన్నారు.
Also Read : Dil Raju Shocking : సంచలన నిర్ణయం తీసుకున్న నిర్మాత దిల్ రాజు



















