రాష్ట్రానికి ద్రోహం చేసిన వైసీపీ ఎంపీలు : సీఎం

అమ‌రావ‌తికి చ‌ట్ట బ‌ద్ద‌త క‌ల్పించ‌డం ప‌ట్ల కామెంట్స్

hellotelugu-APCM

అమరావతి : అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై మద్దతు పలికాయన్నారు. ఈ రాష్ట్రంలో ఓట్లు పొంది, ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు మాత్రం రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించడం దారుణం అన్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తి స్థాయి చట్టబద్దత వస్తుందన్నారు. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.

పార్లమెంటులో ఉండే అన్ని రాజకీయ పార్టీలను, ఎంపీలను అభినందిస్తున్నానని అన్నారు. లోక్‌సభ స్పీకర్ కు, రాజ్యసభ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం అన్నారు సీఎం. రాజకీయ వైరుద్యాలు, వ్యక్తిగత బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు సహకారం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. కానీ ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తాయన్నారు. కానీ రాష్ట్రం నాశనమైనా పర్వాలేదని పట్టుదలగా వ్యవహరించారని జ‌గ‌న్ పార్టీని ఏకి పారేశారు. అమరావతి నాశనం అయినా పర్వాలేదని అనుకున్నారు. కానీ మనం శాసనం చేసుకున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు.

Exit mobile version